ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…