మాగ్నస్ కార్ల్‌సెన్ తన బహిరంగ మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్‌లో డి గుకేష్ అతన్ని ఓడించాడు. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్‌లో గురువారం డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి షాకిచ్చాడు. మొదటి రోజు తర్వాత సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు, ప్రపంచ నంబర్ 1ని ఓడించి ఇప్పుడు 10 పాయింట్లతో ముందుకు సాగాడు. టోర్నమెంట్‌లోని…