గ్యాస్ బండ రేటు కొండలా పెరిగిపోతోంది. మోడీ హయాంలో మోయలేని భారంగా మారింది. గత ఎనిమిదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్ ధర దాదాపు రెండు రెట్లు అయింది. 2014 మార్చి 1న కేవలం 410 రూపాయలు మాత్రమే ఉన్న గ్యాస్ రేట్ ఇవాళ 11,00 దాటింది. ఇది 14.2 కేజీల గృహవసరాల సబ్సిడీ సిలిండర్ ధర మాత్రమే కావటం గమనార్హం. ఈరోజు ఒక్కసారే రూ.50 పెరగటంతో 11,00కు చేరింది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు రూ.1055గా ఉన్న ధర ఇవాళ…
గత కొద్దిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 ధర పెంచింది. ఈ ధరలు నిన్నటినుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరింది. ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై ధరలు పెంచడం ఇది రెండోసారి. మార్చి…