కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో…