ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో రీక్యాంప్ ఉంటుందని అంచనాలు. ఇది GST మోడల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ జియోపాలిటికల్ అస్థిరతల నేపథ్యంలో.. ఆర్థిక వేగాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.