Youtube Shorts: మన దేశంలో మొబైల్ ఫస్ట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ షార్ట్స్ తెరిచిన ద్వారమని ఆసియా-పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. రెండేళ్ల కిందట తొలిసారిగా ఇండియాలోనే యూట్యూబ్ షార్ట్స్‌ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. యూట్యూబ్‌లో షార్ట్-ఫామ్ కంటెంట్‌ని క్రియేట్ చేయటం మరియు ఈజీగా వీక్షించటం కోసం వీటికి రూపకల్పన చేశామని చెప్పారు. యూట్యూబ్ షార్ట్స్.. ప్రపంచవ్యాప్తంగా ఒకటిన్నర బిలియన్‌ల కన్నా ఎక్కువ మంత్లీ లాగిన్ చేసే యూజర్స్ కమ్యూనిటీని పెంచుకున్నాయి.