Home
Cs Shanti Kumari
Cs Shanti Kumari News
-
CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు. -
Ramzan: ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Ramzan: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులు కోసం ప్రత్యేక రాయితీని ప్రకటించింది. వారి మతపరమైన ఆచారాలను పాటించేందుకు వీలుగా రోజువారీ పని సమయాన్ని ఒక గంట తగ్గించి, ముందుగా ఇళ్లకు వెళ్లే అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో… -
Off The Record: ఓ సామాజికవర్గమే పెత్తనం చేస్తుందా..? సీఎస్ పేషీలో అసలేం జరుగుతుంది?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్‌లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి. -
CS Letter: ఈ-ఫార్ములా రేసింగ్‌పై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ లేఖ
ఈ-ఫార్ములా రేస్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాశారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను సీఎస్ జతచేసి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో విచారణకు గవర్నర్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
TGPSC Group 3 Exams: రేపు, ఎల్లుండి గ్రూప్-3 నియామక పరీక్ష..
TGPSC Group 3 Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-3 నియామక పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు గ్రూప్-3 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో ఇప్పటికే సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
CS Shanti Kumari : ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొననున్న 14,000 మంది పాఠశాల విద్యార్థులు
CS Shanti Kumari : తెలంగాణ “ప్రజా ప్రభుత్వం” మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న హైదరాబాద్‌లో ప్రజా విజయోత్సవం లేదా “ప్రజాపాలన విజయోత్సవం” ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ వేడుకలో సుమారు 14,000 మంది పాఠశాల విద్యార్థులు హాజరైన విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాపరమైన మద్దతును… -
TG Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. -
CS Shanti Kumari : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నాం
ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది… -
TGDRF : 2000 మందితో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్‌లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు… -
Caste Enumeration: సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఈ కులగణనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సమగ్ర కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వేను ఇంటింటి కుటుంబాల రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేసింది. ఈ సర్వేను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Sayaji…
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!