భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది.