Vijayawada: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. టపాసుల దుకాణాలతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి తిరుపతిలో, ఆదివారం ఉదయం విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి మందులు విక్రయించే స్టాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న మరో రెండు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో మూడు షాపుల్లో దీపావళి టపాసులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. Read…