ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్‌లు వచ్చినా…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది. Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ,…
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి…
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ శనివారం నాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జనవరి 10 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ జీవోను జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. Read Also:…
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ప్రభుత్వం.. ఇక, మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమలుచేయనున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మే 2న కౌంటింగ్ ప్రక్రియతో పాటు…