కరోనా వైరస్ విజృంభన కోనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకముందు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి గతంలో 14 రోజులు సెలవులను ప్రకటించిన సింగరేణి సంస్థ.. ఇప్పుడు 7రోజులు మాత్రమే కరోనా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజాగా…