మన దగ్గర ఒకప్పుడు సినిమాలు విడుదలకు ముందు ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే కొనసాగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కి మాత్రం ఈ సారి కొంచెం విభిన్నంగా, ఇంకా గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. “కూలీ అన్‌లీష్డ్” పేరుతో జరిగిన ఈ ఈవెంట్ యూట్యూబ్ లేదా ఇతర ఛానెల్స్‌లో లైవ్ ఇవ్వకుండా, సన్ టీవీ లో…