కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో జీవితఖైదీ అనుభవిస్తున్న ఖైదీ నిఘా కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడు. 25 అడుగుల ఎత్తున్న జైలు గోడ దూకి పారిపోయాడు. ఆశ్చర్యమేంటంటే ఖైదీ వికలాంగుడు కావడం విశేషం. ఒక చెయ్యి లేదు. అయినా కూడా గోడ దూకి పారిపోవడం అధికారుల్ని కలవరపాటుకు గురిచేసింది.