వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు.