Delhi: ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. అనేక హత్యల్లో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ గాయపడ్డాడు. లొంగిపోవాలని కోరినా కూడా కమిల్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డారు. తరువాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.