కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో.. కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు.