Rahul Gandhi: బీహార్‌లో మహిళలకు పంపిణీ చేయాలనుకుంటున్న ఉచిత ‘‘శానిటరీ ప్యాడ్స్’’పై రాహుల్ గాంధీ బొమ్మ ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. మహిళల కోసం ఇచ్చే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ముఖం ఎందుకు ఉందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు.