Damodara Raja Narasimha : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం…