ఇటీవల మహ్మద్ ప్రవక్త మీద నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాల్లో ఆగ్రహావేశాలు రగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలు రోజుకొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడు. కర్నాటకలో ఈశ్వరప్ప జాతీయ…