త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్,…