Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టినప్పటి నుంచి నడుము కింద భాగంలో తోకలాంటిది పెరుగుతూ, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న ఏడాదిన్నర చిన్నారిని చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎక్కడా పరిష్కారం దొరకలేదు.