ప్రజా రక్షణ , సేవే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ, సామాన్యులకు భరోసా కల్పించేందుకు మరో కీలక అడుగు వేసింది. సాధారణంగా ఏదైనా ఆపద కలిగినా లేదా నేరం జరిగినా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే, వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్‌కు రాలేని వారి కోసం, పోలీసులు నేరుగా బాధితుల ఇంటికే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే వినూత్న వెసులుబాటును కల్పించనున్నారు. నేరాలకు గురైన వారు భయాందోళనలో ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యం,…