ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మత్య్స సంపద దొరకడం లేదని, దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని గత నెల 23, 24 తేదీలలో మత్స్యకారులు భారీ ఆందోళన నిర్వహించారు. అక్టోబర్ 10లోపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని డెడ్ లైన్ పెట్టారు. అప్పటివరకు వేటకు వెళ్ళమని మత్స్యకారులు క్లారిటీ ఇచ్చారు.…