ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే... కాగా.. గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన ఇచ్చారు. ఈ క్రమంలో.. తాను వేలానికి వెళితే ఎంత మొత్తం వస్తుందని అభిమానులను అడిగాడు పంత్.