Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు