సాధారణంగా ప్రభుత్వ పథకాల పనులంటేనే నాసిరకంగా ఉంటాయనేది ప్రజల నమ్మకం. కాంట్రాక్టర్లు తమ కక్కుర్తితో భవనాలను, రోడ్లను నాసిరకంగా నిర్మిస్తుంటారు. అయితే చేయి వేస్తే కూలిపోయేంత నాసిరకంగా మాత్రం భవనాలు నిర్మించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి భవనం కాదు.. రూ.100 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ భవనం. నాణ్యత పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే చేయి వేయగానే భవనం గోడలు…