ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తుందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు.