తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.