చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా.. చేతులు, ముఖం కడుక్కోవడానికి, స్నానానికి గీజర్లు వాడుతున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ గీజర్లతో పాటు ఎల్‌పీజీ గీజర్ల వాడకం కూడా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గీజర్ల వల్ల ప్రమాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. స్నానం చేస్తూ స్పృహతప్పి పడిపోవడంతో పాటు పలు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రీజర్‌లు వాడేవాళ్లు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.