Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. బుధవారం రాయ్‌పూర్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సాయ్ ప్రమాణస్వీకారం జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రులుగా బీజేపీ నేతలు అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.