ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్ ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ…