Bandi Snajay: కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: నాడు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డి నేడు ఓటుకు ఒట్టు అంటున్నాడు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
మెదక్ జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏం పొయ్యేకాలం వచ్చిందో కేసీఆర్ కి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
అగ్నిప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధం.. 40 ఇళ్లు బూడిద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోండాలోని ధనేపూర్ ప్రాంతంలోని చకియా గ్రామంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామం మొత్తం దగ్ధమైంది. ఇక్కడ దాదాపు 40 ఇళ్లకు చెందిన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగడంతో ఒక గేదె సజీవదహనం కాగా, ఓ మహిళ దగ్ధమై చికిత్స పొందుతోంది. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.…
మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా…
మోడీ, రాహుల్‌లకు ఎన్నికల సంఘం నోటీసులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం లేదా భాష ప్రాతిపదికన ఆయన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ…
Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..