Brahmanandam meets CM KCR in Pragati Bhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్ టాప్ కమెడియన్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగనున్న తన చిన్న కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులను కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు బ్రహ్మానందం. ఈ క్రమంలో తాను స్వయంగా స్వహస్తాలతో కుంచె పట్టి…
రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కోతలను అధిగమించి అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ పారిశ్రామిక సేవా వ్యాపార రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికతతో విద్యుత్ ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించుటకు అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. Breaking news, latest news, telugu news, big news, quality electricity supply,…
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద నుంచి ప్రజలను కాపాడుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.
Kishan Reddy: చేతల ప్రభుత్వం మోడీ ది అని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నారు.
CM KCR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.