కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పర్యటన అనంతరం నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా…