కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.