Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.