Home
Cjp Protest
Cjp Protest News
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
Delhi Protest: ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానం నుంచే అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీని, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.… -
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మమతా బెనర్జీ… -
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న సీజేపీ నేతలు అభిజత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి, వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. తమను అరెస్ట్ చేస్తారని భావించిన దీప్కే, ఉద్యమ బాధ్యతల్ని అజింక్య షిండేకు అప్పగించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు.… -
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
Danish Kaneria: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ సీజేపీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసనను అణచివేయడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చేసిన ఒక సెటైరికల్ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసుల కఠిన భద్రత,… -
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Abhijit Dipke: 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. "మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం.… -
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
Delhi Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను… -
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
Abhijit Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను ఢిల్లీ పోలీసులు ఏకంగా విమానంలోనే అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం ల్యాండ్ అవగానే, పోలీసుల బృందం నేరుగా ఫ్లైట్ లోపలికి ప్రవేశించి ఈ హైడ్రామాకు తెరతీసింది. పోలీసులు విమానం ఎక్కిన వెంటనే అభిజీత్ దిప్కే తన… -
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
CJP Protest: ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఫ్లైట్ లోపలే పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. -
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
Delhi CJP Protest: 'రాత్రి నుంచి తిరుగుతున్నాం.. ఇల్లు చేరడం కష్టమైపోయింది'.. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల కారణంగా జనజీవనం ఎలా అస్తవ్యస్తమైందో చెబుతున్న మాటలివి. ఢీల్లీలో సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచడంతో పాటు 170కి పైగా లోకల్, షార్ట్ డిస్టెన్స్ రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఘజియాబాద్ వెళ్లాల్సి ఉంది. నిజాముద్దీన్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి లోకల్… -
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
Dhruv Rathee: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీకి వచ్చారు. అయితే, గురుగ్రామ్ సెక్రటరీ 56లోని సెంట్రల్ పార్క్ విహార్‌లో ఉన్న ఆయన కుటుంబ నివాసంలోకి శుక్రవారం అర్ధరాత్రి నుంచే సుమారు 50 మంది పోలీసులు మోహరించారు. చివరకు శనివారం ఉదయం 7:48…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!