CJI BR Gavai: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తన తండ్రి కలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం, ఆయన తన మాతృభాష మరాఠీలో చదువుకోవడం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి వెల్లడించారు. తనకు మెరుగైన భావనాత్మక అవగాహన కలిగేందుకు మరాఠీ సహకరించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో జరిగిన న్యాయవాదుల కార్యక్రమంలో సీజేఐ తన చిన్ననాటి విషయాలను నెమరువేసుకున్నారు. ‘‘నేను న్యాయమూర్తిగా మారాలని నా తండ్రి కల నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను’’అని భావోద్వేగంతో, కన్నీళ్లను అపుకుంటూ…