Spielberg - Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం 'మైనారిటీ రిపోర్ట్', మంచి విజయం సాధించింది.