కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్ఆర్ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.