డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.