(మార్చి 28న చిత్తూరు వి.నాగయ్య జయంతి)మహానటుడు చిత్తూరు వి.నాగయ్య పేరు వినగానే ఆయన బహుముఖ ప్రజ్ఞ ముందుగా మనల్ని పలకరిస్తుంది. నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు మరొకరు కనిపించలేదు. తెలుగు చిత్రసీమలో తొలిసారి ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఘనత నాగయ్య సొంతం. మన దేశంలో ఒక్కో సినిమాకు లక్ష రూపాయల పారితోషికం…