అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుందని ఆరోపించారు.
డిఫెన్స్ పడ్డ ఆ ఎమ్మెల్యే.. సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీన్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యహరించారా? రోజంతా హైడ్రామా నడిచిన వ్యవహారంలో కొండను తవ్వి ఎలుకను పట్టుకుంది ఎవరు? పోలీస్ స్టేషన్‌లో నేలపై పరుపు వేసుకుని నిద్ర పోతున్నది ఎవరో కాదు.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఈ సీన్‌కు వేదిక రావులపాలెం పోలీస్ స్టేషన్. రెండు…