ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో మంత్రిగా కొన్నాళ్లున్నారు. అయినప్పటికీ ఏ పార్టీలోనూ పట్టుమని పదేళ్లపాటు కొనసాగలేని పరిస్థితి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలా.. రిటైర్ అవ్వాలా అన్నట్టుగా ఉన్న పొలిటికల్ కెరియర్‌కు అనుచరుడి కామెంట్స్ తలనొప్పి తెచ్చాయా? గండం నుంచి గట్టెక్కేందుకు ఎవరి మద్దతు కూడగట్టాలో అర్థం కావడం లేదా? ఎవరా నాయకుడు? ఏమా కథ? స్థిరమైన ఆలోచన లేదని పాలేటిపై విమర్శపాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు…
వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన ప్రకాశం జిల్లా చీరాలలో ఓటర్లు విభిన్నంగా తీర్పులు ఇస్తుంటారు. చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. ఎనిమిదిసార్లు ఇతర పార్టీల క్యాండిడేట్స్ గెలిచారు. ప్రగఢ కోటయ్య, కొణిజేటి రోశయ్య వంటి ఉద్ధండులు చీరాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా టీడీపీకి కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది. చేనేత సామాజికవర్గం అధికంగా ఉండే చీరాల నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు కూడా…