మహరాష్ట్ర నాగ్ పూర్ లో దారుణం జరిగింది. నలుగురు పిల్లలకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తమార్పిడి చేశారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం ధ్రువీకరించారు. దీంతో ఆ నలుగురు పిల్లలు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు పిల్లలు హ్యుమన్ డెఫిషియన్సీ వైరస్ ( హెచ్ఐవీ) బారిన పడగా… మరొకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. ఈ నలుగురు పిల్లలు కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో రక్తమార్పిడి అవసరం అయింది. పిల్లలకు ఇచ్చిన రక్తం హెచ్ఐవీ పాజిటివ్…