నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.
ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.
చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం శిశు మరణాలు తగ్గుముఖం పట్టిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2030 నాటికి శిశు మరణాలను మరింత తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి యొక్క తాజా నివేదిక ప్రకారం.. 2022 ఐదేళ్లలో మరణిస్తున్న పిల్లల సంఖ్య వయస్సు ముందు ప్రపంచవ్యాప్తంగా 49 లక్షల కనిష్ట స్థాయికి చేరుకుంది.
కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also…
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
ఈ మధ్య ఆయా దేశాల్లో జననాల రేటు తగ్గిపోతున్నాయి. దీంతో బిడ్డల్ని కనేందుకు తల్లులకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల చైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.