బైక్ ప్రయాణించే వారికి హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే వాహనదారులకు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఇటీవల, కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలకు పిల్లల సైజు హెల్మెట్‌లు, సేఫ్టీ హార్నెస్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది.…