Viral : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఓ హృదయాన్ని తాకే ఫిర్యాదు నమోదు అయ్యింది. అపార్ట్మెంట్ సెల్లార్‌లో ఉంచిన తన సైకిల్ దొంగలు ఎత్తుకుపోయారని ఓ చిన్నారి పోలీసులను ఆశ్రయించింది. ఎంతో ఇష్టపడి కొన్న సైకిల్ దొంగతనం కావడంతో బాధపడిన ఆ చిన్నారి, “ఎలాగైనా దొంగను పట్టుకుని నా సైకిల్‌ని తిరిగి ఇవ్వండి” అంటూ వేడుకుంది. పాప మనసును గమనించిన నార్సింగి పోలీసులు ఆ చిన్నారిని ఆదరించి మాట్లాడారు. “నీ సైకిల్‌ని వెతికి పట్టుకుంటాం,…