ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్‌లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…