Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం…